21 C
India
Sunday, February 25, 2024
More

    Credit Score : ఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. చెక్ చేసుకోండి మరి!

    Date:

    Credit Score
    check your Credit Score in phonepe

    Credit Score : క్రెడిట్ స్కోర్.. ఆర్థిక లావాదేవీలకు ఎంతో కీలకం. బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి వ్యక్తుల గత చరిత్ర ఎలా ఉందో క్రెడిట్ స్కోర్ ద్వారానే తెలుసుకుంటాయి. దాని ద్వారానే అతడికి అప్పు ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకుంటాయి. పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా.. హోంలోన్ సహ ఇతర లోన్ లు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోరే కీలకమైంది. మరి తమ క్రెడిట్ స్కోర్  ఎలా ఉందో తెలుసుకోవడానికి బ్యాంకుల వద్దకు పరుగెత్తాల్సి వచ్చేది. లేదంటే బ్యాంకింగ్ యాప్స్ ను ఆశ్రయించాల్సి వచ్చేది.

    తాజాగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే తన యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దీనిలో ‘క్రెడిట్’ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీంట్లో క్రెడిట్ స్కోర్ తో పాటు క్రెడిట్ హిస్టరీని ఉచితంగానే తెలుసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్లు, రుణ వాయిదాల చెల్లింపుల వివరాలను కూడా ఈ ఫీచర్ తో సమర్థంగా మేనేజ్ చేసుకోవచ్చని ఫోన్ పే ప్రతినిధులు చెబుతున్నారు.

    ఇలా చెక్ చేసుకోండి..
    ఫోన్ పే యాప్ ను ఓపెన్ చేయగానే హోమ్ పేజీలోనే ‘క్రెడిట్’ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకుంటే.. యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. ‘క్రెడిట్’ పై క్లిక్ చేస్తే ‘క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కిందే ‘చెక్ నౌ’ అనే బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే క్రెడిట్ స్కోర్ మీకు కనిపిస్తుంది. ఈ స్కోర్ తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్ వినియోగ నిష్పత్తి, క్రెడిట్ ఏజ్, క్రెడిట్ మిక్స్, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు.

    ఇక ఈ ఫీచర్ లో మేనేజ్ క్రెడిట్స్, లోన్ ప్రొఫైల్, పేమేంట్ డ్యూస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చిన ఫోన్ పే ప్రతినిధులు చెప్తున్నారు. అయితే ఫోన్ పే లో లాగిన్ ఫోన్ నంబర్.. పాన్ తో అనుసంధానమైన నెంబర్ ఒకటే అయి ఉండాలి. ఇక మన చేతిలోనే చాలా ఈజీగా క్రెడిట్ స్కోర్ చూసుకోండి మరి.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Google Pay : గూగుల్ పే విస్తరించడానికి ఏర్పాట్లు షురూ

    Google Pay : ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ పే కంటే ఫోన్...

    గూగుల్ పే , ఫోన్ పే , పేటీఎం లావాదేవీలపై పన్నుల మోత

    డిజిటల్ ఇండియా వైపు ప్రజలను మళ్లించడానికి చేసిన ప్రయత్నం గూగుల్ పే...