
Chicago NRI protest : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. రాజకీయాలకతీతంగా మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన డెవలప్ మెంట్ ను ఓర్వలేని వైసీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగా కేసులు పెట్టి బాబును జైల్లో పెట్టించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికాగోలో బాబుకు మద్దతుగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైసీపీ కక్షపూరితంగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపిస్తున్నారు. నిరాధార ఆరోపణలతో బాబును అరెస్టు చేయించి తన గొయ్యి తానే తవ్వుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టేలా చేస్తోంది. బాబును జైలు నుంచి విడుదల చేయాలని దీక్ష చేస్తున్న వారికి యుగంధర్ యడ్లపాటి నిమ్మరసం అందించి దీక్ష విరమణ చేయించారు. చంద్రబాబు అరెస్టు నుంచి దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీక్షలో హిమ కానూరు, రవి కాకర, హను చెరుకూరి, విజయ్ కొరపాటి, రఘు చిలుకూరి, చిరంజీవి గల్లా, హరీష్ జమ్ముల, శ్రీనివాస్ అట్లూరి, మహేష్ కాకరాల, మూర్తి కొప్పాక, సతీష్ వీరపనేని, వినోజ్ చనుమోలు, మురళి కలగార, సతీష్ యలమంచిలి. అశోక్ పరుచూరి, శ్రీహర్ష గరికపాటి, శివ, మహేష్, త్రివేది, శశి, ప్రకాష్, సురేష్ తదితరులున్నారు.
జనసేన నాయకులు కూడా దీక్షలో పాల్గొంటున్నారు. రాష్టంలని అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన వైసీపీ దురాగాతాన్ని ఎండగడుతున్నారు. ఈ దెబ్బతో వైసీపీకి మైనస్ అయిందని గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇలా ఏపీలో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకోవడం గమనార్హం.