Megastar Chiranjeevi : చికెన్ గున్యా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఏటా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతున్నారు. ఈ వైరస్ సోకితే మనిషి మనిషిలా ఉండలేడు. తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతారు. ముఖ్యంగా ఒళ్లంతా నొప్పులతో తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. చికెన్ గున్యా సోకిన వ్యక్తి మరొకరి సహాయంతో మాత్రమే లేచే ఓపిక కలిగి ఉంటాడు. ఇప్పుడు అలాంటి జ్వరం బారిన పడ్డారు మెగాస్టార్ చిరంజీవి. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. 22 సెప్టెంబర్ 2024న, మెగాస్టార్ చిరంజీవి కొణిదెల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ సినీ నటుడిగా, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
1978లో మెగాస్టార్ అరంగేట్రం చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22. మెగాస్టార్ చిరంజీవి 46 ఏళ్లలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూమెంట్స్ చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యాంకర్ మెగాస్టార్ చిరంజీవి గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రికార్డును అందుకున్న క్రమంలోనే ఈ వేడుకకు హాజరైనట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి 25 రోజులుగా ఒకవైపు చికెన్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ, ఇది అతని జీవితంలో అరుదైన క్షణం కావడంతో అతను కూడా నీరసంగా కనిపించాడు. దీంతో ఆయన గిన్నిస్ రికార్డు సృష్టించాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఈ విషయం తెలిసి షాకయ్యారు.