
late marriages : ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కెరీర్ పై ఉన్న ఫోకస్ వల్ల త్వరగా వివాహాలు చేసుకోవడం లేదు. సగటున 30-35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లిపై ధ్యాస పెట్టడం లేదు. దీంతో జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర సమస్యలు వస్తున్నాయి. మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారు. దీంతో సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.
వివాహాలు ఆలస్యంగా కావడంతో సంతాన లేమి కూడా వేధిస్తోంది. సరైన వయసులో పెళ్లిళ్లు కాకపోవడంతో సంతానం త్వరగా కావడం లేదు. దీంతో చాలా మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారు. దీనికి కారణం లేటు మ్యారేజెసే. ఈ తరుణంలో వివాహాలు ఆలస్యం అయి సంతానం కలగకుండా పోవడంతో చాలా జంటలు ఎన్నో మార్గాలు వెతుకుతున్నా కుదరడం లేదు.
కొందరికి పెళ్లిళ్లు కుదరక జాతకాలు కలవక ఉద్యోగంలో ఇమడక సతమతమవుతున్నారు. దీంతో పెళ్లి అనే తంతు వాయిదాలు పడుతూ వస్తోంది. ఉద్యోగం, ఆస్తి లేకపోతే అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు. దీంతో 30 ఏళ్లు దాటేదాకా పెళ్లి కావడం లేదు. దాదాపు 30 శాతం పెళ్లిళ్లు ఆలస్యంగానే అవుతున్నాయి. దీంతో మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలుంటున్నాయి.
పెళ్లిళ్లు జాప్యం కారణంగా 70 శాతం జంటలు సంతాన లేమికి గురవుతున్నారు. చాలా మంది 40 ఏళ్లకు సంతాన భాగ్యం కలిగినా వారు చేతికి అందరు. రెండో కాన్పు కష్టంగానే ఉంటోంది. జననాల రేటు గణనీయంగా పడిపోతోంది. ఈ రేషియో 1.7కు పడిపోవడం గమనార్హం. భవిష్యత్ లో ఇది మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది.