
G20 conference : పొరుగు దేశం చైనా మరోసారి భారత్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ కు అనుకూలంగా స్పందించింది. అయితే దీనిపై భారత్ తీవ్రంగా. స్పందించింది. చైనాకు ఘాటుగా జవాబిచ్చింది. జమ్మూ కశ్మీర్లో జీ20 సదస్సు నిర్వహణకు భారత్ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఆ వేదికపై నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకించింది. అది వివాదాస్పద ప్రాంతమని పేర్కొంది. అయితే ఈ సదస్సుకు తాము హాజరు కావడం లేదని తెలిపింది.
జమ్ము కశ్మీర్లో ఈనెల 22 నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 64 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే భద్రతా బలగాలను భారత్ అక్కడ మోహంచింది. విదేశీ ప్రతినిధుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. చైనా తీరుపై భారత్ స్పందించింది.
ఈ సందర్భంగా భారత ప్రతినిధి మాట్లాడుతూ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహించుకునే హక్కు భారత్ కు ఉందని చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి ఘటనలు చేసుకోకుండా ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పారామిలటరీ బలగాలతో పాటు ఇతర సెక్యూరిటీ గ్రూపులను మోహరించింది.