China School Furniture : విద్యాలయం అంటే మనకు తెలిసింది విద్యకు ఆలయం, విద్యను నేర్చుకునే పవిత్రమైన స్థలం.. విద్య మారుతుందా..? విద్యా విధానం మారుతుందా..? తెలియడం లేదు గానీ బాల్యం నుంచే విద్యార్థులపై విపరీతమైన భారం పడుతుంది. ఆ భారం ఎంతలా అంటే విద్యను నేర్చుకోవడం వారి వల్ల కావడం లేదు సరికదా.. తల్లిదండ్రులకు కూడా వారిని చూస్తే బాధ కలిగేంత. మోతకోలు బుక్స్ ను భుజాన వేసుకొని ఉదయం వెళ్లిన చిన్నారులు పొద్దుగూకాక కానీ ఇంటి బాట పట్టరు.
క్లాస్ లో ఉన్నంత సేపు వారిపై విపరీతమైన భారం పడుతుంది. దీన్ని అర్థం చేసుకుంటారా.. కోరా.. తెలియదు గానీ పై పెచ్చు భారత సమాజంలో మాత్రం దండం ఉపయోగిస్తూనే ఉంటారు. ఇక్కడ ఇది కామనే.. కొన్ని దేశాల్లో చిన్నారులపై పాక్షికమైన దాడికి కూడా తీవ్రమైన శిక్షలు ఉంటాయి. కానీ భారత్ లో మాత్రం విద్యను అర్జించడంలో గురువు చేత దెబ్బలు తినడం కామేనే. అలా అయితేనే విద్యార్థి రాటుదేలి సమాజంలో బతికేంత పరిణతి సాధిస్తాడని నమ్ముతారు.
భారత్ లో కొన్ని పాఠశాలలో ఈ మధ్య స్లీపింగ్ అవర్ అని ఒకటి పెట్టారు. ఈ సమయంలో విద్యార్థులు కాసేపు రిలాక్స్ అవుతారన్నమాట. ఇది ప్రాశ్చాత్య కల్చర్ అయినా విద్యార్థులు రెస్ట్ తీసుకునేందుకు కొంత సమయం దొరుకుతుందని పేరంట్స్ సంబుర పడుతున్నారు. ఇదే విధానం చైనాలో కూడా పాటిస్తున్నారట.
విద్యార్థుల స్లీపింగ్ అవర్ కోసం చైనా ఏకంగా స్కూల్ బెంచీలను తయారు చేసింది. వీటిని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఎలా అంటే అలా మలుచుకోవచ్చు ముందుకు, వెనక్కు.. ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు. పైగా ఈ బెంచీలలోనే బుక్స్ పెట్టుకునేందుకు సపరేట్ సెల్ఫ్ లు, చెద్దర్లు పెట్టుకునేందుకు సపరేట్ సెల్ఫ్ లు, పడుకున్న సమయంలో కాళ్లు పెట్టేందుకు ఇలా అన్ని వయస్సులు, ఎత్తులకు సరిపోయేలా వీటిని తయారు చేశారు. వీటిని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. చూడండి ఎలా ఉన్నాయో..
Students in China are encouraged to rest and nap during school…pic.twitter.com/opkjZEYfuw— Figen (@TheFigen_) October 1, 2023