
ఆధ్యాత్మిక గురువు చినజీయర్ కు భక్తులు ఎక్కువ. ఆయన వేదగురువు, ఉదేశకుడు కూడా. ఎన్నో కాలేజీలను స్థాపించారు కూడా. జిమ్స్ అనే వైద్యశాలను కూడా నిర్వహిస్తున్నారు. మానవ జీవిత సూత్రం సమతా ధర్మం ఆయన చెబుతుంటారు. హిందూ ధర్మ ప్రచారంలో ఆయన ముందుంటారు. అందుకే 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్రం ఆయనకు పద్మభూషణ్ తో సత్కరించింది. గతంలో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుని విమర్శల పాలయ్యారు కూడా.
అయితే ఇటీవల ఆయన ఏపీకి వెళ్లారు. అక్కడ ఓ భక్తుడి ఆహ్వానం మేరకు పర్యటించారు. రాజమండ్రిలో వైసీపీ నేత శ్రీ మాకుళపు శివ రామ సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు ఆమన అక్కడ పర్యటించారు, అయితే జంగారెడ్డి గూడెం నుంచి ఆయన తన వాహన శ్రేణి వెంట రాగా, ప్రయాణించారు. అయితే ఈ 60 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి తనకు 3 గంటలు పట్టిందని సెటైర్లు వేశారు. పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలంటించారు. ఏపీలో రహదారులు బాగాలేవని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు చినజీయర్ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయి. అయితే తెలుగు రాష్ర్టాల్లో చినజీయర్ కు ఫాలోవర్స్ ఎక్కువ. స్వామిజీ మాటలు జనంలోకి కచ్చితంగా వెళ్తాయని అంతా భావిస్తున్నారు. కేవలం 60 కిలోమీటర్ల దూరానికి స్వామిజీ వాహనానికే అంతా పడితే మాములు బస్సుల్లో వెళ్తే ఇంకెంత సమయం పడుతుందోనని చర్చించుకుంటున్నారు. ఇది ప్రతిపక్షాలకు వరంగా మారింది. ఇప్పటికే స్వామిజీ మాటలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దీనిపై స్పందించారు. జగన్ రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్వామిజీ తన ప్రవచనంలో చెప్పడం చూస్తుంటే పరిస్థితి దారుణంగా అర్థమవుతున్నదని చెప్పుకొచ్చారు.