
Chiranjeevi : ఏపీలో బీజేపీ పెద్ద స్కెచ్ వేసిందా? మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఏపీలో బలపడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాపు కమ్యూనిటీలోని కీలక నేతలను లాగాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవికి కేంద్రమంత్రిపదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. త్వరలో కమలదళంలో చేర్చుకొని ఆ తరువాత రాజకీయ భవిష్యత్ లో భాగంగా చిరంజీవిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగు సినీ మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రిపదవితో పాటు భవిష్యత్తులో రాజకీయంగా కీలక భూమిక పోషించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చిరంజీవి ఇప్పటికే రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో, బీజేపీ అధిష్ఠానం ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించాలని యోచన చేస్తోంది.
ఇక రాష్ట్ర బీజేపీ భవిష్యత్తు, రాబోయే ఎన్నికలు, పార్టీ వ్యూహాలు ఇవన్నీ చిరంజీవి చేరికతో కొత్త మలుపు తిరుగుతాయని అంచనా. దీనిపై అధికారిక ప్రకటన వస్తే, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.