chiranjeevi silk smitha మెగాస్టార్ చిరంజీవి ఏంటి సిల్క్ స్మితను కొట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. మరి నిజంగానే సిల్క్ స్మితను చిరు కొట్టారా.. కొడితే ఎందుకు కొట్టారు.. అందుకు కారణం ఏంటి? నిజంగానే కొట్టారా ? లేకపోతే ఏదైనా షూట్ లో భాగంగా అలా చేసారా? అందుకు కారణం ఏంటో ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
చిరంజీవి స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. మరి చిరు సహాయం పొందిన వారిలో జయకుమార్ కనగల ఒకరు.. ఈయన తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య జరిగిన విషయాన్నీ బయట పెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
ఈయన మాట్లాడుతూ.. చిరంజీవి, సిల్క్ స్మిత కాంబోలో ఎన్నో ఐటెం సాంగ్స్ వచ్చాయి అనే విషయం తెలిసిందే.. అయితే ఒక సినిమాలో చిరంజీవి షూట్ లో భాగంగా సిల్క్ స్మితను కొట్టే సీన్ ఒకటి ఉంది.. ఆ సీన్ గురించి సిల్క్ స్మిత కు చెప్పేటప్పుడు చిరు చెంపపై కొడతారు అని నేను చెబితే నన్ను కొడతాడా అంటూ సెటైరికల్ గా మాట్లాడింది.
ఆ సన్నివేశాన్ని తీసేయండి అంటూ డిమాండ్ చేసింది.. ఈ విషయం తెలుసుకున్న చిరు షూటింగ్ సెట్లో సన్నివేశం తీసే సమయంలో నిజంగానే సిల్క్ స్మిత చెంపపై కొట్టారు.. దీంతో కోపంతో షూట్ సెట్ నుండి 6 గంటలకే వెళ్తానని నానా రచ్చ చేసింది.. అయిన ఉండాలని ఆమెకు చెప్పేసరికి అక్కడే మద్యపానం సేవించింది అని ఈయన చెప్పుకొచ్చాడు..