Bhola Shankar Updates :
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం విడుదలకు సిద్ధమైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా పెరిగాయి. చిరు ఇమేజీని దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేశారు. చిరు పాత్ర కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. దీంతో చిరంజీవి సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. చిరంజీవి తన డబ్బింగ్ చెప్పేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భోళా శంకర్ విడుదలకు సిద్ధం అవుతోంది.
సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11 న విడుదల అవుతోంది. దీంతో భోళా శంకర్ ఏం వండర్ క్రియేట్ చేస్తుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రేక్షకుల అంచనాల మేరకు చిరు సినిమాలు నిర్మించడం దర్శకులకు సవాలే. ఈ సందిగ్ధంలో వారు అయోమయానికి గురయ్యే ప్రమాదముంది. భోళా శంకర్ హిట్ సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
భోళా శంకర్ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ సినిమాల విజయంతో ఊపు మీదున్న చిరుకు భోళా శంకర్ కూడా ప్లస్ కానుందని అభిమానులు చెబుతున్నారు. సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. దీంతో సినిమా బాగా వచ్చిందంటున్నారు. మొత్తానికి భోళా శంకర్ ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా లేదా తేలాల్సి ఉంది.






