
Chiranjeevi Movie :
ఇప్పుడు సినిమా షూటింగులు ఎలా జరుగుతున్నాయో అందరికి తెలుసు.. ఒక్కో సినిమాకు 100 రోజుల సమయం కూడా చాలడం లేదు.. ఏకంగా ఏడాది పాటు షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో నిర్మాతలకు చాలా లాస్ వస్తుంది. అయితే అప్పట్లో ఒక సినిమాను కేవలం 29 రోజులకే పూర్తి చేశారట.. ఆ సినిమా రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యింది.
మరి 29 రోజుల్లోనే పూర్తి చేసిన సినిమా ఏంటి?ఎవరు దీనిని డైరెక్ట్ చేసారు? హీరో ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ సినిమా ఏంటి అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.. ఈ సినిమాను కోడి రామకృష్ణ తెరకెక్కించారు.. 1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పటికే 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది..
ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ముందుగా యావరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా ఆ తర్వాత ప్రేక్షకాదరణ పెరగడంతో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా 512 రోజులపాటు ఆడిందట.. అప్పటికే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవితో కోడి రామకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.
మెగాస్టార్ తో హాస్యం పండించి ఈయన కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచేలా చేసారు.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మాధవి హీరోయిన్ గా నటించగా పూర్ణిమ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా షూట్ ను 29 రోజుల్లోనే పూర్తి చేసారు.. ఈ సినిమాను 3 లక్షల 20 వేలతో తెరకెక్కించగా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.. సెన్సార్ విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పట్టువదలకుండా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.