
Chiranjeevi : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. 8 ఏళ్ల వయసున్న మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఆయన తెలిపారు.
“మార్క్ శంకర్‌కు స్వల్పంగా కాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని చిరంజీవి పేర్కొన్నారు.
చిన్నారి మార్క్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.