Megastar Chiranjeevi :
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల తీసిన సినిమాపై టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను మాత్రం రాబడుతూనే ఉన్నాయి. వరుస విజయాలను సొంత చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు చిరు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇదే జోష్ తో ‘భోళా శంకర్’ సినిమా తీశారు ఆయన. ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఇప్పటికే ఆగస్ట్ 11 అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ మూవీ తర్వాత ఒకే సారి మరో భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేయనున్నారు చిరంజీవి.
అందులో ఒక ప్రాజెక్ట్ కు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మరో ప్రాజెక్ట్ కు ‘భింబిసార’ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ చేయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులలో ఒకదానితో తన పెద్ద కూతురు సుష్మిత కెరీర్ ను కూడా గాడిలో పెట్టాలని అనుకుంటున్నారట చిరంజీవి. ఆమె ఇటీవల ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. ‘గోల్డ్ బాక్స్’ అనే బ్యానర్ ను స్థాపించింది. దీంతో ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ తో పాటు సంతోష్ శోభన్ హీరోగా ఓ మూవీని నిర్మించింది. అయితే ఈ రెండు ఆమెకు కలిసిరాలేదు. కెరీర్ మొదట్లోనే భారీ డిజాస్టర్లను ఎదుర్కొంది సుష్మిత.
రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీపై శ్రీమతి సురేఖ సమర్పించిన సైరా సినిమాతో కొడుకును నిర్మాతగా నిలబెట్టిన చిరంజీవి. ఇప్పుడు కూతురును ఎలాగైనా తను ఎంచుకున్న రంగంలో నిలబెట్టాలని చూస్తున్నారు. అందుకు తాను త్వరలో ప్రకటించే రెండు చిత్రాల్లో ఒకదాన్ని ‘గోల్డ్ బాక్స్’ బ్యానర్ పై చేసేందుకు సిద్ధం అవుతున్నారట. తన చిత్రంతో కూతురికి పెద్ద హిట్ అందించి ఇండస్ట్రీలో ఆమెను నిలబెట్టాలని అనుకున్నారట. అందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించి. ఈ ఏడాది చివరికి లేదా.. వచ్చే ఏడాది మొదట్లో (సంక్రాంతికి) సినిమా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఇది సక్సెస్ అయితే సుష్మిత లైఫ్ గాడినపడ్డట్లేనని అంతా అనుకుంటున్నారు.