
Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024పై అగ్ర కథానాయకుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అవార్డుల సంప్రదాయాన్ని పునరుద్ధరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనది.
సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి నటుడు, టెక్నీషియన్‌కు ఎంతో ప్రేరణనిస్తుంది. అద్భుతమైన సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించటం, ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధితశాఖ మంత్రులు, అధికారులకు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.