టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని టీడీపీ సభ్యులు నినదించారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆందోళనలను మంత్రి అంబటి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతల ఆందోళనలకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. ఈ నిరసనలో వైసీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ పోడియం వద్ద చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. పేపర్లు చూపి, స్పీకర్ వద్ద ఉన్న మానిటర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమ పార్టీ నుంచి టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యే ఓవర్ చేస్తున్నారంటూ మంత్రి అంబటి సభలో వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు పోడియం వద్ద నిలబడగా, టీడీపీ సభ్యలు పోడియం పైకి ఎక్కారు. ఈ క్రమంలో కోటం రెడ్డి తీరువై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను మంత్రులు కోరారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకు చర్యలకు ఎమ్మెల్యే ఉపక్రమించారు. మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా ఈరోజు అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి పంపించి వేశారు.
ReplyForward
|