- కొట్టుకుంటున్న రెండు ఫ్యామిలీలు

Allagadda : ఆళ్లగడ్డలో టీడీపీకి చెందిన రెండు వర్గాల తీరు వివాదస్పదమవుతున్నది. భూమా, ఏవీ ఫ్యామిలీల గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా కలిసి సాగారు. అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమ అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలోచ్చయి. ఆస్తుల వివాదం అని కొందరు అంటుంటే సీటు విషయంలో అని మరికొందరు అంటున్నారు. అయితే తనపై అఖిలప్రియ హత్యాయత్నం చేయించిందని గతంలో ఏపీ సుబ్బారెడ్డి ఆరోపించడం మరింత సంచలనం రేపింది.
తాజాగా లోకేశ్ ముందే..
ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్ర ఆళ్లగడ్డలో ప్రవేశించింది. ఈ క్రమంలో భూమా, ఏపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. యువనేత లోకేశ్ ముందే తమ బలాబలాలు చూయించుకున్నారు. ఈఘటనలో ఏవీ సుబ్బారెడ్డి గాయపడినట్లుగా సమాచారం. ఏవీ వర్గీయుల ఫిర్యాదులతో బుధవారం అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది
కొన్నాళ్లుగా కలహాలు..
అయితే భూమా, ఏవీ కుటుంబాలకు ఆళ్లగడ్డలో మంచి పేరుంది. నాగిరెడ్డి ఉన్నంత కాలం సుబ్బారెడ్డి ఆయనతోనే కలిసి నడిచారు. అఖిలప్రియ సైతం ఏవీ సుబ్బారెడ్డి అంటే ఎంతో అభిమానం చూపించేవారు. అయితే ఇటీవల ఈ రెండు కుటుంబాల మధ్య కలహాలు ముదిరాయి. పలు సందర్భాల్లో దాడుల వరకు వెళ్లారు. తన ను అఖిలప్రియ చంపేందుకు ప్రయత్నిస్తున్నదని సుబ్బారెడ్డి ఆరోపణలు కూడా చేశారు. కొన్ని ఆస్తుల వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని తమకు సుబ్బారెడ్డితో ఎలాంటి విరోధం లేదని మరోవైపు అఖిలప్రియ ప్రకటించారు. అయితే తాజా వివాదం ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణ క్రియేట్ చేసింది. మరి ఈ రెండు ఫ్యామిలీ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయోనని అంతా అనుకుంటున్నారు. ఇంటి పెద్దలా పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరిని పిలిచి మాట్లాడితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. లేకుంటే ఈ గొడవలు ఇలాగే కంటిన్యూ అయితే పార్టీకి కూడా నష్టం తప్పదని చెబుతున్నారు.