YCP Chittoor : చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభమైంది. రోజురోజుకూ కుమ్ములాటల పర్వం పెరు గుతోంది. వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డి,డిప్యూటి మోయర్ రాజేష్ కూమార్ రెడ్డి వర్గీయులు మధ్య గొడవలు తలెత్తాయి.
డిప్యూటీ మేయర్ రాజేష్ కూమార్ రెడ్డిని,ఆయన ఆనుచరులని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ వద్దకు విజయానంద రెడ్డి సహాఇరువర్గాల అనుచరులు భారీగా చేరుకున్నారు.
నిన్నా మెన్నటి వరకు విజయానంద రెడ్డికి రైట్ హ్యాండ్ గా రాజేష్ కమార్ రెడ్డి మెలిగారు. తాజాగా రాత్రి చోటుచేసుకున్న ఇరు వర్గాల అనుచరుల దాడి ఆ పార్టీలో ఎన్నికలవేల తీవ్ర కలకలం రేపుతోంది.