AP Rains : ఏపీలో విద్యా సంస్కరణలు చేపట్టారు సీఎం జగన్. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో గణనీయ మార్పు చేశారు. చాలా ప్రాంతాల్లో అడ్మిషన్లు ఫుల్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అదేవిధంగా పాఠశాలలకు డ్రాపౌట్ రేటును తగ్గించడంలో నాడు నేడు కార్యక్రమం సక్సెస్ అయ్యింది. కార్పొరేట్ స్థాయి హంగులతో పాఠశాలలను తీర్చిదిద్దారు. 44512 స్కూళ్లను బాగు చేయడంలో భాగంగా తొలివిడుతలో రూ. 3700 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెచ్చిన ఈ పథకం.. ఏపీలోని విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే తెలంగాణ కంటే కూడా ఏపీలో నే విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయనేది ఒప్పుకోవాల్సిన నిజం. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో గణనీయ మార్పు సాధించినట్లు ప్రచారానికే పరిమితమైంది.
అయితే జగన్ చేసిన పనులు అంతా ఉట్టిదేనని.. ఏమాత్రం ప్రగతి లేదని అర్థమైపోయింది. ఈ భారీ వర్షాలకు స్కూళ్లలో నీళ్లు కారి గొడుగులతో విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది. నాడు – నేడు లో భాగంగా గొడుగులు పట్టుకుని తరగతి గదుల్లో కూర్చుంటున్న విద్యార్థుల వీడియో వైరల్ అయ్యింది… తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట జెడ్పీ హైస్కూలోని తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థుల పరిస్థితి ఇది..