33.4 C
India
Wednesday, May 21, 2025
More

    CM Chandrababu : మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఆరుద్ర కుమార్తె వైద్యానికి సాయం

    Date:

    CM Chandrababu
    CM Chandrababu

    CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ బాధితురాలు ఆరుద్రకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆమెకు చెప్పినట్లుగానే రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సచివాలయంలో అధికారులు తనకు రూ.5 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఆరుద్ర కుమార్తెకు నెలకు రూ.10 వేల సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ అన్నవరం, అమలాపురం, కాకినాడలలో తమను ఇబ్బంది పెట్టినవారిపై కేసును నమోదు చేయాలని, పోలీసుల మీద ప్రత్యేక కమిషన్ వేసి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కోర్టు కేసులు కొట్టించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని, ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారిపై, తాము అప్పుల పాలవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు.

    ఆరుద్ర కుమార్తె లక్ష్మితో కలిసి ఈ నెల 14న అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. ఆరుద్ర కుమార్తెకు రూ.10 వేల పింఛనుతో పాటుగా వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆరుద్ర ఆస్తి వివాదాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముందు వరకు ఆరుద్ర తన కుమార్తెతో కలిసి వారణాసిలో ఉన్నారు. ఆ తర్వాత ఏపీకి తిరిగొచ్చి చంద్రబాబును కలిశారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన...

    CM Chandrababu : నేడు హైదారాబాద్ కు ఏపీ సీఎం

    ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాలకు హాజరు CM Chandrababu :...

    CM Chandrababu : అమరావతిలో 5 ఎకరాల భూమి కొన్న సీఎం చంద్రబాబు!

    CM Chandrababu : కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి కొత్త కళ...