Tirupati incident: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు.
తిరుపతి తొక్కిసలాటలో నలుగురు మృతి..
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా.. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి. ఊహించని స్థాయిలో భక్తులు తరలిరావడం, ఒక్కసారిగా అందరినీ లోపలికి పంపించడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు.
పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.