ఈ బెదిరింపుల దృష్ట్యా జగన్ కు భద్రతను భారీగా పెంచారు. ఇకపై విజయవాడ, వైజాగ్ లలో జగన్ వద్ద ఒకటి కాదు రెండు హెలీకాప్టర్లను ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ హెలీకాఫ్టర్లకు ఏపీ ప్రభుత్వం నెలకు రూ.1.91 కోట్ల చొప్పున అద్దె చెల్లించనుంది.
జగన్ కు ఇప్పటికే జెడ్ కేటగిరీ భద్రత ఉందని, గుర్తించిన ముప్పు దృష్ట్యా ఈ భద్రతను మరింత పెంచనున్నారు. తక్షణమే ఆయన భద్రతను గణనీయంగా పెంచనున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారానికి ముందు ఈ భద్రతా ముప్పు ప్రతిపాదన వస్తోంది కాబట్టి ఇకపై జగన్ తన చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారని ఆశించవచ్చు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హెలీకాప్టర్ వ్యవహారం ప్రజల్లోకి నెగెటివ్ టాక్ ను తీసుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా దీనికి నెలకు రూ. 1.90 కోట్ల చొప్పన అద్దె కట్టాలి. విలువైన ప్రభుత్వ సొమ్మును ఇలా ఉపయోగించడం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. సీఎంకు ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఎలా? అని చెప్పేవారు లేకపోలేదు. ఏది ఏమైనా సీఎం హెలీ కాప్టర్ అద్దె వ్యవహారం ప్రజల నోల్లలో నానుతూనే ఉంటుంది.