CM Jagan : అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్‌కు వాస్తవ సర్వేల ఫలితాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ, జనసేన కూటమి విజయం సాధి స్తుందని చెబుతున్నాయని.. జగన్ సొంత సర్వేల్లో నూ ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయని వైసీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. కాగా టీడీపీ, జనసేన పార్టీలతో బీజేసీ పొత్తు దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు జగన్‌లో అలజడి రేపుతు న్నా యి. ఈ నేపథ్యంలో ఐప్యాక్ బృందం తో సీఎం సోమవారం మంతనాలు జరిపారు.
Breaking News