21.6 C
India
Wednesday, February 11, 2026
More

    ధరణిపై దిద్దుబాటు ధోరణిలో కేసీఆర్.. ఎందుకంటే!

    Date:

    CM-KCR-corrects-the-dharani-portal : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ల కోసం తీసుకువచ్చిన ధరణి పై దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం దిగినట్లుగా కనిపిస్తున్నది. దీనిపై కొన్ని రోజులుగా రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ధరణి పోర్టల్ తో కార్యాలయాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తరచూ వార్తల్లో వస్తున్నాయి. తమ భూములు రాత్రికి రాత్రే పేర్లు మారుతున్నాయని కొందరు రైతులు ఆందోళనలకు దిగారు. ఇలా కొన్ని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి.
    అదే సమయంలో ధరణి తీసుకురావడానికి ప్రధాన కారణం భూ స్కామేనని ఎక్కువ మంది జనం నమ్ముతున్నారు. రికార్డుల్లోకి ఎక్కని భూములను వివిధ పద్ధతుల్లో బీఆర్ఎస్ నేతలు తమ పేర్లపై మార్చుకుంటున్నారని, వివాదాస్పద భూములను కూడా సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బయటకు పుకార్లు వచ్చాయి. అయితే నిజానికి  ధరణితో భూముల రిజిస్ట్రేషన్ వేగవంతంగా అవుతున్నది. అయితే అసలు భూ రికార్డులను నిర్వహించే దగ్గరే అసలు సమస్య వస్తున్నది.
    ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. బహిరంగ సభలో ఇప్పటికే ధరణి  గురించి ప్రచారం కల్పిస్తున్నారు ధరణి వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికిందని ఆయన చెబుతున్నారు.‌ దరణి దళారీ అవసరాన్ని దూరం చేసిందని ప్రజలకు పదేపదే చెబుతున్నారు. ధరణి వల్ల కొత్త వివాదాలు వచ్చాయి కానీ పరిష్కారం కాలేదని మరోవైపు రైతులు అంటున్నారు. అయితే ధరణి పోర్టల్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
    ఏదేమైనా ధరణిపై రైతుల్లో వ్యతిరేకతను ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తున్నది అందుకే కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు ఇది ఫలిస్తుందా లేదా వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related