22.7 C
India
Tuesday, October 6, 2026
More

    CM KCR : ఆ మహిళల గోడు పట్టని కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుతో అభాసుపాలు

    Date:

    CM KCR
    CM KCR

    CM KCR : కొన్ని రోజుల క్రితం వరకు ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళనలు కొనసాగాయి. బీజేపీ కి చెందిన ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తీరుపై అమ్మాయిలంతా ఆందోళనకు దిగారు. దీనిపై పలు సంఘాలు, దేశంలో పార్టీలు మండిపడ్డాయి. వెంటనే బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీలు డిమాండ్ చేశాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు. రెజ్లర్లకు న్యాయం చేయాలని పదే పదే మాట్లాడడం తో పాటు ట్వీట్లు కూడా చేశారు. అయితే తెలంగాణలో పరిస్థితులకు సంబంధించి మాత్రం ఇప్పుడు భిన్నంగా వ్యవహరించడం పై అంతా మండిపడుతున్నారు. ఇందులో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యేల వ్యవహారాలు చర్చకు వస్తున్నాయి.

    స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీరు ఆదినుంచి వివాదస్పదమే. ఈ క్రమంలోనే ఈయన మంత్రి పదవి కూడా కోల్పోయారు. ఈయన కథలు ఇంతింత కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల తాటికొండ రాజయ్య తనను వేధిస్తున్నాడని ఓ మహిళా సర్పంచ్ మీడియా ముఖంగా వెల్లడించింది. ఇది రాష్ర్టవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా మరోసారి అదే మహిళా సర్పంచ్ రాజయ్య తనను టార్గెట్ చేశాడంటూ మళ్లీ  కన్నీటిపర్యంతమైంది. తన భర్తను అడ్డుపెట్టుకొని, రాజీకి రమ్మంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా ఈ వ్వవహారం రాష్ర్ట రాజకీయాల్లో సంచలనంగా మారింది.

    మరోవైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారం కూడా వివాదస్పదమే. గతంలోనూ ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆరిజన్ డెయిరీ నిర్వాహకురాలు శేజల్ ను వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెపై కేసులు పెట్టి జైలుకు పంపారు. అయితే ఆమె తెలంగాణలో పోలీసులు, కొందరు నాయకులు టార్గెట్ చేశారని ఢిల్లీ కి వెళ్లింది. మహిళా కమిషన్ ను, సీబీఐని ఆశ్రయించింది. తనను కుట్రతోనే వేధిస్తున్నారని, శారీరకంగా, మానసికంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను ఆమె బయటపెట్టింది. మరికొన్నింటిని పోలీసులు డిలీట్ చేశారని ఆమె ఆరోపించింది. దీంతో పాటు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యవహారం కూడా వివాదస్పదమవుతున్నది. తన సంతకం ఫొర్జరీ చేశారని సొంత కూతురే  ఆరోపిస్తున్నది.

    అయితే తెలంగాణలో ఇలాంటి ఎమ్మెల్యేల తీరుపై ప్రభుత్వం స్పందించకపోవడం వివాదస్పదమవుతున్నది. అయితే మరోవైపు సదరు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇచ్చేది సందేహామేననే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. సదరు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఇలాంటి వాటిని ఆయన ఊపేక్షించరని, ప్రస్తుతం ఎన్నికల ఉన్న నేపథ్యంలో పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఆయన వెయిట్ చేస్తున్నారని పార్టీలో కొందరు చెబుతున్నారు. అయితే మహిళల ఆవేదనపై అధిష్టానం సైలెంట్ గా ఉండడం మరికొన్ని విమర్శలకు తావిస్తున్నది. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. ఏదేమైనా అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి, సీఎం కేసీఆర్ కు చెడ్డ పేరు తెస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...

    Telangana Muslim : తెలంగాణ ముస్లిం జనాభా కేసీఆర్ పట్ల సంతృప్తిగా లేరా? కారణం ఇదేనా?

    Telangana Muslim : రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్...

    BRS : ఆ గ్యాపే బీఆర్ఎస్ కొంప ముంచిందా? 

    BRS: తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం నవంబర్ 30వ...