
ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ 132 వ జయంతి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. 2016 లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భారీ విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేసాడు. కాగా ఇన్నాళ్లకు ఆ విగ్రహం పూర్తి కావడంతో ఏప్రిల్ 14 న అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ముఖ్య అతిథిగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది. దాంతో హుస్సేన్ సాగర్ , ఖైరతాబాద్ , నెక్ లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అంతేకాదు పలు రూట్ లలో ట్రాఫిక్ ను మళ్లించారు. ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.






