
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో భద్రతా లోపంపై ఆగ్రహంతో అడిషనల్ ఎస్పీ నారాయణ్ భారమణిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అధికారి వెనక్కి జరగడంతో ఆయన తగలనిచ్చుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. సీఎం తీరుపై బీజేపీ, జేడీ(ఎస్) నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మాత్రం బీజేపీ శ్రేణుల తీరునే ఈ వివాదానికి కారణమని ఆరోపించారు. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.