
CM Siddha Ramaiah : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ పేరును ప్రకటించింది. ఆరో రోజుల ఉత్కంఠ చర్చల నడుమ ఎట్టకేలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ , కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి రణ్దీప్ సుర్జేవాలా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే కాంగ్రెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నది.
పీసీసీ చీఫ్ కూడా ఆయనే..
కర్ణాటక ఏకైక డిప్యూటీ సీఎంగానే కాకుండా పీసీసీ చీఫ్ గా కూడా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ ఈయనే రాష్ర్ట బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే గురువారం రాత్రి కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ఉంటుంది. ఎమ్మెల్యేలు అధికారికంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అనంతరం తమ లేఖను గవర్నర్ కు అందజేస్తారు. ఈనెల 20న సిద్ధరామయ్య కంఠిరవ స్టేడియంతో ప్రమాణ స్వీకారం చేస్తారు.