Karnataka.. : ఇద్దరు కోచ్ లు స్టేడియంలో వాదులాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఆమెను దూషిస్తూ, చెప్పు చూపిస్తూ కొడతా అంటూ ఓ కోచ్ ని మరో మహిళ బెదిరిస్తున్నారు. బెంగళూర్ లో జరిగిన ఈ ఘటన పై క్రీడాకారుల్లో చర్చ జరుగుతున్నది.
బిందు రాణి సీనియర్ మాజీ అథ్లెట్, కంఠీరవ స్టేడియానికి సీనియర్ కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియానికి వెళ్లారు. ఆ సమయంలో కోచ్ యతీష్ భార్య శ్వేత జీకే బిందు రాణితో గొడవకు దిగారు. స్టేడియంలో ఆమెపై అరుస్తూ చెప్పు చూపిస్తూ బెదిరించారు. అయితే ఈ ఘటనపై బిందు రాణి స్పందించారు. తనపై మొదట అథ్లెటిక్స్ అసోసియేషన్ లో శ్వేత ఫిర్యాదు చేశారని.. అయితే దీన్ని ఎందుకు పెద్దది చేయడమని సైలెంట్ గా ఉన్నానని బిందు రాణి తెలిపారు. ఈ వ్యవహారంపై శ్వేత కూడా స్పందించారు. తానొక ఖేల్ రత్న అవార్డు గ్రహీత అని బిందు రాణి ప్రకటించిందని, బెస్ట్ అథ్లెట్ అవార్డు 19 సార్లు, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ నని, 200 కంటే అధికంగా మెడల్స్ గెలుచుకున్నానని బిందు రాణి అన్న దానిపై తన భర్త యతీశ్ స్పష్టత ఇవ్వమన్నారని చెప్పారు.
బిందు రాణి చెప్పిన విషయం నిజమని నిరూపిస్తే కర్ణాటక రాష్ట్ర ప్రజలు కూడా గర్వంగా ఫీలవుతారని మాత్రమే అన్నారని బిందు రాణి తెలిపారు. ఇది జరుగుతుండగానే శ్వేత, యతిష్ లు ఓ టెడ్ ఎక్స్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి బిందు రాణి కూడా వెళ్లారు. అదే ఈ గొడవకు దారి తీసినట్లు తెలుస్తున్నది. యతిష్ కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు రాణి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసిందని, ప్రైవేట్ వీడియోని షేర్ చేస్తావా అంటూ కోచ్ యతిష్ భార్య బిందు రాణిపై దాడి చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కంఠీరవ స్టేడియం కోచ్ లు ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో తన ప్రదర్శన గురించి యతిష్ పోస్ట్ చేస్తున్నాడని.. తాను రూమర్లు ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బిందు రాణి ఆరోపించారు.
తన భర్త యతిష్ కి కాల్ చేసి పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించారని.. అయితే అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసి తానొక్కరే మాట్లాడారని బిందు రాణి ఆరోపించారు. స్టేడియంలో యతిష్ తనను దూషించాడని కూడా ఆరోపించారు. అసోసియేషన్ నుంచి ఎవరైనా అధికారులు వస్తే తను సమాధానం చెప్పేదాన్నని బిందు రాణి స్పష్టం చేశారు. ఈ ఘటనకు ముందు తనకు కోచ్ భార్య ఎవరో తెలియదన్నారు. అయితే యతిష్ మాట్లాడుతూ బిందు రాణి గురించి వాట్సప్ గ్రూపులో అడిగింది నిజమేనని చెప్పారు. బిందు రాణి ప్రదర్శన, అవార్డుల గురించి వాట్సాప్ గ్రూపులో అడిగింది నిజమేనని.. ఆ తర్వాత బిందు రాణి భర్త కాల్ చేసి బెదిరించాడని, ఇలాంటి ప్రశ్నలు అడిగితే కొడతానని అన్నాడని ఆరోపణలు చేశారు. ఈ ఘటన అథ్లెట్ల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే యతిష్ భార్య.. ఈ ఘటన తర్వాత కాల్ చేసి తనకు క్షమాపణలు చెప్పారని బిందు రాణి వెల్లడించారు.
ReplyForward
|