30.9 C
India
Saturday, May 17, 2025
More

    MLAs clash : నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.. వైరల్ వీడియో

    Date:

    MLAs clash : అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (టీడీపీ), విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు (బీజేపీ) నడిరోడ్డుపైనే తీవ్ర వాగ్వాదానికి దిగడం స్థానికంగా కలకలం సృష్టించింది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలిం క్లబ్) లీజు వ్యవహారమే వీరిద్దరి మధ్య ఘర్షణకు దారితీసినట్లు సమాచారం.

    వివరాల్లోకి వెళితే, ఫిలిం నగర్ క్లబ్ లీజు విషయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన నియోజకవర్గానికి సంబంధించిన అంశం కానప్పటికీ జోక్యం చేసుకుని కలెక్టర్‌ను కలవడంపై గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇద్దరు నేతలు ఎదురుపడినప్పుడు వాగ్వాదం చోటుచేసుకుంది.

    “నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఎలా జోక్యం చేసుకుంటారు? మీ ధోరణి ఏమాత్రం బాగాలేదు, ఇది సరికాదు” అంటూ గంటా శ్రీనివాసరావు నడిరోడ్డుపైనే విష్ణుకుమార్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ఫిలిం క్లబ్ లీజు వ్యవహారంపై కలెక్టర్‌ను కలిసే సమయంలో గంటా శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడం వల్లే తాను కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, విష్ణుకుమార్ రాజు వివరణతో సంతృప్తి చెందని గంటా శ్రీనివాసరావు, తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా జోక్యం చేసుకుంటే సహించేది లేదని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

    కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల సమక్షంలోనే ఇలా వాగ్వాదానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫిలిం నగర్ క్లబ్ లీజు వ్యవహారంపై వీరిద్దరి మధ్య విభేదాలు ఇప్పటికే ఉన్నాయని, తాజా సంఘటనతో అవి బహిర్గతమయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Pratap C. Reddy : 92 ఏళ్ల వయసులో 70 వేల కోట్ల ఆస్తి.. ఇదీ ‘రెడ్డి’ గారి ఘనత

    Dr. Pratap C. Reddy : 92 ఏళ్ల వయసులోనూ అపార శక్తితో...

    Manchu Manoj : చివరికి ‘అత్తరు సాయిబు’ గా మారిపోయిన మంచు మనోజ్..ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

    Manchu Manoj : మంచు మనోజ్ తాజా చిత్రం 'అత్తరు సాయిబు' తో...

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    Canadian Elections : కెనడా ఎన్నికలు : అధ్యక్ష రేసులో ముందంజ ఎవరంటే?

    Canadian elections : కెనడాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో...