
Cockfighting : సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు, జంతు హింస జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పండుగకు 3 రోజులు ముందుగానే పందేలు ప్రారంభమయ్యాయి. అమలాపురంలో కొందరు బహిరంగంగా టెంట్లు వేసి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల LED స్క్రీన్లు, లైటింగ్, వీఐపీల కోసం స్పెషల్ గ్యాలరీలు సిద్ధం చేశారు. ఈసారి రూ.వందల కోట్లు చేతులు మారే అవకాశం ఉంది.