24 C
India
Sunday, October 11, 2026
More

    Colors Swathi : స్వాతి జీవితం నాశనం చేసిన తల్లి.. చివరికి ఆమె పరిస్థితి ఇలా అయ్యింది!

    Date:

    Colors Swathi :

    బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన కలర్స్ స్వాతి అనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. మా టీవీ కండక్ట్ చేసిన ‘కలర్స్’ షోకు స్వాతి హోస్ట్ గా పని చేసింది. అందుకే ఆమెకు కలర్స్ స్వాతి అనే పేరు స్థిరపడిపోయింది. ఈ కార్యక్రమాన్ని చూసిన దర్శక నిర్మాతలు ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా కూడా చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటుందట.

    కలర్స్ స్వాతి వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకోబోతోందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీటిపై ఆమె ఇంత వరకు స్పందించలేదు. అయితే ఇందులో నిజం లేకపోలేదని ఇండస్ట్రీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    విడాకుల నేపథ్యంలో ఇండియాకు వచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. వీటితో పాటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించాలని అనుకుంటుందట. హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు మాత్రం అవకాశాలు మాత్రం రావడం లేదు. గతంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నా ప్రస్తుతం ఆఫర్లు మాత్రం రావడం లేదట అందుకు కారణం ఒకరు ఉన్నారని తెలుస్తోంది.

    రంగుల ప్రపంచంలో గ్లామర్ కీ రోల్ పోషిస్తుంది. అప్పుడప్పుడు మనం గీసుకున్న గీతను దాటకపోతే సినిమా అవకాశాలు రావు. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు గ్లామర్ చూపించలేదు. దానికి కారణం కూడా ఉందట. అదే ఆమె తల్లి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కలర్స్ స్వాతి తల్లి నిత్యం బిడ్డను అంటిపెట్టుకునే ఉండేదట. గ్లామర్ సీన్స్ కు నో చెప్పేవారట. ఇంకా ఎవ్వరితోనూ మాట్లాడనిచ్చే వారు కాదట. వీటికి తోడు అనేక కండీషన్స్ పెట్టేవారట.

    ఈ నేపథ్యంలో స్వాతికి అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు, దర్శకులు ఇంట్రస్ట్ చూపలేదు. ఆమె తల్లి చేష్టలకు వారు విగిసిపోయారు. దీని వల్లే ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయని తెలుస్తోంది. కేవలం తల్లి కారణంగానే స్వాతి అవకాశాలు కోల్పోయి సినీ కెరియర్ నాశనం చేసుకున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related