
సుధాకర్.. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. నవ్వించాడు. సుధాకర్ పక్కన లేకుండా అప్పట్లో హీరోలు నటించేవారు కాదు. అంతలా పేరు సంపాదించుకున్నాడు. ‘రాజా’ సినిమాలో వెంకటేశ్ పక్కన హిట్ బ్రేక్ తెచ్చుకున్నాడు. సూర్యవంశం సహా అగ్రహీరోల పక్కన నటించాడు. అలాంటి సుధాకర్ లావుగా.. ఒక యాసతో మాట్లాడితే అందరూ నవ్వేవారు. కానీ ఇప్పుడు వెండితెరపై కనిపించడం లేదు. అనారోగ్యంతో మంచానపడ్డాడు.
90వ దశకంలో సుధాకర్ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపారు. కమెడియన్ గా, విలన్ గా, కామెడీ హీరోగా.. స్టార్ కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే అనారోగ్యంతో ఆయన సినిమాలకు దూరమయ్యారు. కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. నిన్న మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. సుధాకర్ రిప్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

అయితే సుధాకర్ కు ఏమీ కాలేదని.. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని తాజాగా ఆయన ఫొటోలు విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారం చేయవద్దని.. చనిపోని సుధాకర్ ను చంపొద్దని హితవు పలికారు.
అయితే సుధాకర్ ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. బొద్దుగా.. లావుగా ఉండే సుధాకర్ ఇప్పుడు అస్సలు పీలగా.. ఆ చెంపలు మొత్తం పీక్కపోయి ముసలోడిలా ఓ రోగిస్టిలా కనిపిస్తున్నాడు. సుధాకర్ లైవ్ ఫొటోలు చూసి అయ్యో ఈయన ఆ సుధాకర్ యేనా? గుర్తుపట్టకుండా మారిపోయాడని అందరూ తెగ బాధపడిపోతున్నారు.
సుధాకర్ కెరీర్ చూస్తే మొదట్లో చిరంజీవితో పాటు ఒకే రూమ్ లో ఉండేవాడు. తర్వాత భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కీళుక్కెం పొోగుమ్ రెయిల్’ అనే సినిమాతో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.తర్వాత టాలీవుట్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగారు. చివరగా సూర్య నటించిన ‘గ్యాంగ్’ సినిమాలో రమ్యక్రిష్ణ భర్తగా నటించాడు. ఆయన ఆరోగ్యం బాగాలేక సినిమాలకు దూరమయ్యాడు. తాజాగా విడుదల చేసిన షాకింగ్ పిక్ వైరల్ అయ్యింది.