Compassionate Jobs :
కరోనా సమయంలో మృతిచెందిన వారి కుటుంబాలను కారుణ్య నియామకాల ద్వారా సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే 1488 మందికి ఈ మేరకు ఉద్యోగాలు ఇఛ్చారు. మరో 1149 మందికి ఈ ఏడాది ఆగస్టు వరకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
కొత్తగాతీసుకునే వారికి సంబంధించిన విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు పాటించాలని శాఖాధిపతులు, కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్ లైన్ ను విధించింది. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్, పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఆగస్టు 17 లోగా పూర్తి చేసి, 24 లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే మరణించిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే, విద్యార్హత ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగ నియామక పత్రం జారీ చేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలని ప్రభుత్వం పేర్కొంది. గ్రమా సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతల ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.