
అయితే సేజల్ ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆత్మహత్యాయత్నం చేసింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని పేర్కొంది. న్యాయం కోసం ఇటీవల జాతీయ మహిళా కమిషన్ ను కూడా సంప్రదించింది. అయితే తాజాగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పూర్తి విచారణ చేపట్టాలని కోరింది. అరిజన్ డెయిరీ ఏర్పాటు విషయంలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనను వేధిస్తున్నట్టు సేజల్ పదే పదే ఆరోపణలు చేస్తున్నది. అయితే సేజల్ పై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. డెయిరీ ఏర్పాటు పేరుతో రైతులను మోసగించారనే ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మరోవైపు దుర్గం చిన్నయ్య వ్యవహారంపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గాఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తలనొప్పి పార్టీకి చిక్కుకుంటే ప్రమాదమని భావిస్తున్నది. ఇక దుర్గం చిన్నయ్యకు టికెట్ కష్టమేననే కథనాలు వస్తున్నాయి. ఆయనపై ఇప్పటికే ఫిర్యాదులు ఉన్న క్రమంలో బెల్లంపల్లిలో కొత్త అభ్యర్థి ఎంపికపై పార్టీ దృష్టి పెట్టినట్లు టాక్. దుర్గం చిన్నయ్య వ్యవహారం పార్టీకి తలనొప్పిలా మారిందని, ఇది జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం తనకు సేజల్ తో ఎలాంటి సంబంధం లేదని, తన ప్రత్యర్థులే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని చెబుతున్నారు. రైతులను మోసం చేస్తున్నందునే అరిజన్ డెయిరీపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుపుతున్నారు. అయితే ఈ వివాదం మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ఈ విషయంలో ఆమె ఏకంగా రాష్ర్ట పోలీసులపై కూడా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. రాష్ర్ట పోలీసులపై నమ్మకం లేకే ఆమె సీబీఐని కలిసిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. మరి ఇక దుర్గం చిన్నయ్య కు గండం తప్పేలా లేదు. ల






