
Modi as the leader : యావత్ ప్రపంచం ఇప్పుడు జపించే పేరు నరేంద్ర మోడీ. సందర్భంగా ఏదైనా.. సమావేశం ఏదైనా మోడీ లేనిదే పూర్తికాదు. జీ20 సమ్మిట్, బ్రిక్స్, ఇలా ఏ సమావేశమైనా సరే భారత ప్రధాని ఉండాల్సిందే. ఒకప్పుడు విశ్వ గురువుగా ఉన్న దేశం ఇప్పుడు మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తుందని త్వరలోనే ప్రపంచానికి గురువుగా మారుతుందని అది ఒక్క నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని ప్రపంచంలోని ప్రముఖులు అనుకుంటున్నారు.
నరేంద్ర మోడీ భారత్ కు ప్రధాని మాత్రమే కాదు. ప్రపంచానికి దిక్సూచి కూడా. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇది యుద్దాల సమయం కాదని, తాము మాత్రం శాంతికే ఓటేస్తామని చెప్పిన ఆయన ప్రపంచంతో కీర్తించబడ్డారు. దాయాది దేశం పాకిస్తాన్ కూడా తమ పార్లమెంట్ లో నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడాయంటే ఆయన విలువ ఎంతో అర్థమవుతుంది. ఇక కొవిడ్ సమయంలో ఆయన పేద దేశాలకు చేసిన సాయాన్ని ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదు. అందుకే భారత్ విశ్వగురువుగా వర్థిల్లుతుంది.
రీసెంట్ గా అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ అక్కడి పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం యావత్తు వేర్లు ఇండియా నుంచే వ్యాపించాయని ఆయన చెప్పిన విధానం పార్లమెంటేరియన్లతో పాటు ఆ దేశ అధ్యక్షుడిని కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత బిజినెస్ టైకూన్లతో జరిగిన సమావేశంలో అందరూ ముక్త కంఠంతో మోడీ గొప్ప తనాన్ని పొగిడారు. ఎలన్ మస్క్ తాను కూడా మోడీ ఫ్యాన్ చెప్పగా.. సీస్కో మాజీ సీఈఓ జాన్ థామస్ ఛాంబర్ తను 40 సంవత్సరాల కాలంలో ఇంతటి గొప్ప ప్రధానిని చూడలేదన్నారు. ఈయన హయాంలోనే ఇండియా ఎకానమిలో నెం.1 అవుతుందని జోస్యం చెప్పారు.
ఇక మోడీ దాదాపు ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను కలుపుకొని 20 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇంత కాలంలో ఆయన ఒక్క రూపాయి కూడా వెనుకేసుకోలేదు. 9 సంవత్సరాలు సీఎంగా ఉంటే 2 ఎకరాల నుంచి 2వేల కోట్ల సంపద సృష్టించుకునే వారిని చూశాం. 5 సంవత్సరాలు తన తండ్రి సీఎంగా ఉంటే కోట్లాది రూపాయలకు పడగలెత్తిన కొడుకులను చూశాం. కానీ 20 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉండి కూడా ఆయన ఒక్కరూపాయి వెనుకేసుకోలేదు. సరికదా తన కుటుంబానికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆయన బతికేందుకు ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూ అందులో కూడా కొంత చారిటీలకు ఇస్తూ గడుపుతున్నారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం నరేంద్ర మోడీది. ఆయన విదేశాల పర్యటనలకు వెళ్లిన సమయంలో తనను చూసేందుకు వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తారు మోడీ. దేశభక్తి, దైవభక్తి, ధర్మనిరతికి నిలువెత్తు నిదర్శనం మోడీ. విలువలకు కట్టుబడి పని చేసే నేత.