NATS Celebrations : నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 8వ అమెరికా తెలుగు సంబరాలు 2025 జులై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడాలోని టాంపాలో టాంపా కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్స్ టంపా బే టీమ్ ఆధ్వర్యంలో వి్న వినాయక పూజ చేశారు. ఉత్తర అమెరికాలో తెలుగు వారి స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుందని సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ పేర్కొన్నారు.
శాస్త్రీయ, సమకాలీన, సంగీత నాటకాలతో ప్రదర్శనలు, సెమినార్లు, వర్క్ షాప్ లు, ప్యానెల్ చర్చలు 8న అమెరికా తెలుగు సంబరాల్లో ఉంటాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఈ వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు సూచిస్తున్నారు. తెలుగు సంబరాలను అట్టహాసంగా నిర్వహించి మంచి ప్రదర్శనలు చేస్తామని పేర్కొంటున్నారు.
నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సభ్యులు కొత్తా శేఖరం, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ల రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ అరికట్ల, సురేష్ బజ్జా, టాంపాబే దాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, విజయ్ కట్టా, శేఖర్ యెనమండ్ర, ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీష్ పాలకుర్తి, రవి కదిలిండి, మాధురి గుడ్ల, శైలేంద్ర గుడ్ల, మాలిని తంగిరాల, శ్యామ్ తంగిరాల తదితరులు పాల్గొన్నారు.