BJP Supreme court : కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, సుప్రీం కోర్టుకు మధ్య ఎవరు గొప్ప అనే వైరం చుట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ఢిల్లీపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికే పెత్తనం అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అసలు చట్టసవరణకే కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ అధికారాలను ముగ్గురు అధికారులతో కూడిన బృందానికి అప్పగిస్తూ ఈ బిల్లు సవరణ చేసింది. అయితే న్యాయస్థానం మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంటుందనేది సుప్రీం కోర్టు
ఆలోచన.
అయితే కొంతకాలంగా కేంద్ర సర్కారు, సుప్రీం కోర్టు మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. న్యాయమూర్తుల నియామకం విషయంలో, ఢిల్లీ అర్డినెన్స్, సీఈసీ నియామకం, తదితర అంశాల్లో తేడా కనిపించింది. కేంద్ర ప్రభుత్వ తీరును తరచూ న్యాయవ్యవస్థ ఎండగడుతుండడంతో అది మోదీ సర్కారుకు ఇబ్బందిగా మారింది. మణిపూర్ అల్లర్ల అంశంలో కూడా న్యాయస్థానం జోక్యం చేసుకున్న తర్వాతే కేంద్రం స్పందించింది. స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మరోవైపు న్యాయస్థానం తీర్పులకు ఎదురువెళ్లేందుకే మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నది. తద్వారా శాసనం ద్వారా చట్టాలను మార్చేస్తున్నది. దీనిపై పలుమార్లు సీనియర్, రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు మండిపడ్డారు. ఇక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే మోదీ సర్కారు ఇలాంటి చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే శాసన వ్యవస్థకు న్యాయవ్యవస్థకు మధ్య సంబంధాలు మరింత జట్లంగా మారి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని న్యాయాన్ని పనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ సేవల బిల్లు సీఈసీ నమకం బిల్లులను బట్టి చూస్తే సుప్రీంకోర్టు తీర్పులను పాటించకూడదని కేంద్రం అనుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు అసలు వివాదానికి కారణం అవుతున్నది