
karnataka-elections-2023 congress and JDs and BJPకర్నాటక ఎన్నికల్లో బీజేపీ హిందూ ఓట్లనే నమ్ముకుంది. హిందూ ఓట్ల పోలరైజేషన్‌పైనే ఆపార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందుకోసం ముస్లిం సామాజిక వర్గానికి గతంలో కాంగ్రెస్ సర్కార్ రద్దు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల కూడా రద్దు చేస్తామని ప్రకటించింది. ఆ నాలుగు శాతం రిజర్వేషన్లను కర్నాటకలోని వెనబడిన తరగతులకు కేటాయిస్తామని ప్రకటించింది.
ఒకలింగా వర్గానికి 2 శాతం, లింగాయిత్ వర్గానికి మరో 2 శాతం రిజర్వేషన్లను సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది.ఈరెండు సామాజిక వర్గాల ఓట్లు కర్నాటకలో భారీగానే ఉన్నాయి. బీజేపీ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్,జేడీఎస్‌లకు కొంత ఇబ్బందికర అంశంగా పరిణమించింది.
ఈనేపథ్యంలోనే ఆయా వర్గాలు బీజేపీకి దగ్గరయ్యే అవకాశమున్నందున కాంగ్రెస్,జేడీఎస్‌లు అలర్టయ్యాయి. ఒకలింగా,లింగాయిత్ వర్గాల మెజార్టీ ఓట్లు బీజేపీకే పడే అవకాశమున్నందున ఇతర సామాజిక వర్గాలపై ఆ రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. బీజేపీకి కౌంటర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాయి. అందులో భాగంగానే బీజేపీకి చెక్ పెట్టి రాజకీయంగా కాంగ్రెస్,జేడీఎస్‌లు లబ్ధి పొందేందుకు ప్రణాళికలు రచించుకున్నాయి.
బీజేపీకి ఇబ్బందికరమైన నిర్ణయాన్ని ప్రకటించాయి. రాబోయే ఎన్నికల్లో తమకు అధికారాన్ని అప్పగిస్తే.. రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 75 శాతానికి పెంచుతామని వెల్లడించాయి. కాంగ్రెస్,జేడీఎస్ రెండు పార్టీలు ఇదే అంశంపై ఒకే ప్రకటన చేశాయి. అంతేకాక బీజేపీ రద్దు చేస్తామని చెప్పిన నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను కూడా అలాగే కొనసాగిస్తామని జేడీఎస్ ప్రకటించింది.
ఒక విధంగా ఈ రెండు పార్టీలు కర్నాకట ఎన్నికల వేళ బీజేపీ వేసిన ఎత్తుకు చెక్ పెట్టాయనే చెప్పాలి. మరో 10-12 రోజుల్లోనే పోలింగ్ ఉన్నందున ఆ రాష్ట్రాల్లోని మెజార్టీ పార్టీలు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా పనిచేస్తాయన్నది మాత్రం చూడాలి మరీ..!






