Congress BRS BJP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో వింత పోకడ కనిపిస్తుంది. వారిద్దరు పొత్తు అంటే.. వారిద్దరూ పొత్తు అంటూ మూడు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ఇద్దరికీ బూచి ‘కేసీఆర్’ కావడం ఇక్కడ విశేషం. కాంగ్రెస్ ఎవరిని నిల్చుండబెట్టినా తర్వాత వారు కేసీఆర్ పంచన చేరాల్సిందే అని బీజేపీ అంటుంటే.. బీజేపీ బీటీమ్ బీఆర్ఎస్ అంటూ రెండు పార్టీల మధ్య అక్రమ సంబంధాన్ని కాంగ్రెస్ అంటగడుతోంది. నిన్న (జూలై 2) ఖమ్మం సభలో కూడా రాహుల్ ఇదే మాట చెప్పాడు.
తెలంగాణలో త్రిముఖ పోరు నడుస్తోంది. ఒక వైపు బీఆర్ఎస్, మరో రెండు వైపులా బీజేపీ, కాంగ్రెస్. అయితే ఏ ఒక్కరు మీటింగ్ పెట్టినా ఇద్దరిది లోపాయికారి పొత్తు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మా పార్టీ తప్ప మిగిలిన రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకొని, మమ్మల్ని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు.’ అనే ప్రచారం చేయడం ఇక్కడ మూడు పార్టీలకు అలవాటుగా మారింది.
బీజేపీ-బీఆర్ఎస్ కు అపవిత్రమైన పొత్తు ఉన్నదని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉంది. మోడీ వ్యూహంలో భాగంగానే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి తోడు మోడీని గద్దెదించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కూటమిలోకి బీఆర్ఎస్ ను రానివ్వబోమని, ఒక వేళ కూటమిలోకి కేసీఆర్ బలవంతంగా వస్తే కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లు రాహుల్ ఖమ్మం సభలో చెప్పాడు.
బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయిన బీజేపీ కూడా తీవ్రంగా ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీనే ఫైనలైజ్ చేస్తారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకే వెళ్తారని బీజేపీ చెప్తోంది.
ఇక బద్ధ శత్రువులైన బీజేపీ-కాంగ్రెస్ ఎప్పటికీ కలువవు అయినా బీఆర్ఎస్ అక్రమ సంబంధం అంటూ చెప్తున్నా ఇది ఆలోచనకు కూడా సాధ్యం కాదు. కాబట్టి రెండు జాతీయ పార్టీలు స్థానిక పార్టీతో పొత్తులో ఉందనడంలో సందేహం లేదు కానీ, ఎవరనేది ఇప్పటి వరకు తేలింది లేదు. ఒక రకంగా చూసుకుంటే బీజేపీతోనే బీఆర్ఎస్ కలిసి వెళ్తుందనేది మాత్రం ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది.
ReplyForward
|