
Congress focused : కర్ణాటక ఊపో లేక బీజేపీ వెనుకబడుతుంతో తెలియదు గానీ.. కాంగ్రెస్ మాత్రం మరింత జోరుగా పని చేస్తుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో జెండా ఎగరేయాలని గట్టిగానే కష్టపడుతోంది. అందుకు తగ్గ వ్యూహాలు, ప్రతి వ్వూహాలను పన్నుతోంది. ఈ మధ్య కర్ణాటక ఎన్నికల్లో గెలుపొందడంతో ఈ ఊపునే 2023 లో ఎన్నికలు జరిగే స్టేట్ లలో కూడా చూపించాలని, ఆ తర్వాత 2024లో ఎంపీ స్థానాలను ‘హస్త’గతం చేసుకొని సింహాసనాన్ని అధిరోహించాలని చూస్తోంది.
రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్ఆర్ఐలపై దృష్టి పెట్టింది. వారిని తమ వైపునకు తిప్పుకుంటే ఎంతో కొంత పార్టీకి మేలు చేకూరుతుందని అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగా కార్యక్రమాలను రూపొందించి మరింత వేగంగా ముందుకు పోతోంది. అయితే ఇప్పటికే ఇతర దేశాలలో ఉన్న ఇండియన్స్ బీజేపీకి ఎక్కువగా మద్దతిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ‘హౌడీ మోడీ’ గతంలో అమెరికాలో నిర్వహించిన కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చూపులను తన వైపునక తిప్పుకుంది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలంటే కాంగ్రెస్ కు కూడా అక్కడ అంత అభిమానులు ఉండాలి. కానీ ఇప్పటి వరకైతే లేరు. ఇప్పుడు వారిపై ఫోకస్ పెట్టింది పార్టీ.
సెక్యూలర్ అండ్ డెమోక్రెటిక్ ఇండియా కోసం చేయి కలపాలని ఎన్ఆర్ఐలను అభ్యర్థిస్తున్నాడు రాహుల్ గాంధీ. దాని కోసం 4 జూన్, 2023వ తేదీ మధ్యాహ్నం (ఇండియన్ టైమ్) 2 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాహుల్. ఆ రోజు యూఎస్ లో ఎన్ఆర్ఐలతో ఆయన కలిసి మాట్లాడనున్నారు. అందుకోసం ముందుగానే www.rgvisitusa.comలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూసిస్తున్నారు. వీరితో మాత్రమే ఆయన ఇంటరాక్షన్ కానున్నారు. కాంగ్రెస్ కు మద్దతు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకోసం వారితో కలిసి రాహుల్ చేపట్టే కార్యక్రమాలు, తదితరాలపై ఆయన విస్తృతంగా మాట్లాడనున్నారు. కాంగ్రెస్ గెలుపునకు మీరు కూడా కలిసి రావాలని ఆయన కోరనున్నారు.