Telangana Politics : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 8 లక్షల 50 వేల దొంగ ఓటర్ ఐడీలు తయారు చేసిందని.. ఆధారాలతో సహా బయటపెట్టిన కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలనం సృష్టించారు. దేశమంతా ఓటర్ ఐడీ స్కామ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ఈయన బయటపెట్టారు.
తెలంగాణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని హస్తం ఉందని ఆఱోపించారు. ఇదొక దేశద్రోహం కిందకి వస్తుంది.. ఎలక్షన్ కమిషన్ కు ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు.
తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం 18 ఏండ్ల నుండి 35 ఏండ్ల లోపు వయసున్న దాదాపు 8 లక్షల 50 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ గల్లంతు చేసిందని.. ఓటర్ ఐడీ మీద ఫోటోలు, ఫోన్ నంబర్లు మార్చి దొంగ ఓటర్ ఐడీలు తయారు చేశారని ఆరోపించారు.
ఇదే ఫ్రాడ్ దేశమంతా జరుగుతుంది.. డిప్యూటీ సీఎం భార్య నందిని హస్తం కూడా దీంట్లో ఉందని ఆరోపించారు. మార్ఫింగ్ కేసులో అరెస్టయిన వాళ్లను డిప్యూటీ సీఎం భట్టి భార్య ఫోన్ చేసి విడిపించారు.. ఇదంతా ఖమ్మంలో నందిని పర్యవేక్షణలో జరుగుతుంది – బక్క జడ్సన్…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 8 లక్షల 50 వేల దొంగ ఓటర్ ఐడీలు తయారు చేసింది..
ఆధారాలతో సహా బయటపెట్టిన కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్
దేశమంతా ఓటర్ ఐడీ స్కామ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ pic.twitter.com/KX4VWDFL6J
— Telangana 🦁Reddy 🦁 (@Reddys98) December 23, 2024