
Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియస్ యాక్షన్ కు సిద్ధమైంది. ముఖ్యంగా ఆయన పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు. ఇటీవల కాంగ్రెస్ చేసి కులగణనపై తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. మంత్రి కేటీఆర్ దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ‘క్రమ శిక్షణ కమిటీ’ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఆయనపై చర్యలకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు నోటీసుల్లో వివరణ ఇవ్వాలని మల్లన్నను కోరారు. అలాగే ఆయనపై అనేక విమర్శలు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకపోవడం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
మల్లన్నపై వచ్చిన విమర్శలు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఆయన ఇమేజ్‌ను కోల్పోతున్నారు. కాంగ్రెస్ పక్కలో బల్లెంలా ఆయన తయారవుతున్నాడు.
ఈ పరిణామాలు మల్లన్న రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో పడేస్తున్నాయి. నోటీసులు వచ్చిన నేపథ్యంలో మల్లన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో వేచిచూడాలి.