Rs 5000 For Women : తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం అభయం పథకం అమలు చేస్తాను ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతినెల 5 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.
ఇవాళ లాంచ్ చేసిన యాప్ లో అర్హులైన కొందరు మహిళల వివరాలు పొందపరచామని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తామని తెలిపారు.
పేద కుటుంబాలకు అండగా ఉండాలని ఉద్దేశంతో ఈ పథకం రూపొందించామని వైయస్ షర్మిల తెలి పారు. కాంగ్రెస్ పార్టీ నూతనంగా ప్రవేశ పెట్టబోతున్న కార్యక్రమo గురించి షర్మిల ట్విట్ చేశారు.