28.5 C
India
Friday, March 21, 2025
More

    Congress : కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా..?

    Date:

    Congress :

    తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఎవరికీ అర్థం కాని రీతిలోకి మారిపోయాయి. దాదాపు 9 సంవత్సరాలుగా స్తబ్ధుగా ఉన్న పార్టీ గెలుపు బాట పడుతుంటే.. ప్రజల్లో ఆదరణ తెచ్చుకున్న మరో పార్టీ ఇక కోలుకోలేనంతగా చతికిలపడిపోయింది. ఈ పరిణామంతో ఇదే సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్న రాష్ట్రాల్లో కంటే తెలంగాణ వైపునకే దేశం యావత్తు చూస్తోంది.

    గతంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు పూర్తి వ్యతిరేకంగా పోయిన పార్టీ బీజేపీ. ప్రతీ అంశంలో ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ ప్రజల నోళ్లలో నిత్యం నలుగుతూ ఉండేది. కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక తెలంగాణలో కూడా వచ్చేది తామేనంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. దీంతో కేడర్ లో ఊపు వచ్చింది. బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపునకు చూసేంతగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మాది సెకండ్ ప్లేస్ కోసం మీరు మీరూ కొట్టుకోండంటూ బీజేపీ, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాల్ విసిరేంతగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. దీనికి కారణం పూర్తిగా కర్ణాటక గెలుపే. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

    ఇప్పటి వరకూ తెలంగాణ రాజకీయ చిత్రాన్ని చూసుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రాష్ట్రం తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు మరిచిపోలేదు. కొన్ని సీట్లను వారికీ ఇచ్చారు. దీనికి తోడు ఒకటి రెండు స్థానాల్లో తెలుగుదేశం కూడా గెలిచింది. రాను రాను కాంగ్రెస్, టీడీపీలు టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయ్యాయి. దీంతో ప్రతిపక్షం లేకుండా పోయింది. కమ్యూనిస్ట్ లు కూడా ఇదే బాట పట్టారు. దీంతో రెండో సారి ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టితో విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అన్ని ఎన్నికలలో రికార్డు స్థాయిలో విజయం దక్కించుకుంది.

    పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. పట్టణాల్లో విపరీతమైన ఆదరణ ఉన్న పార్టీ పల్లెల వరకు వచ్చే సరికి అడ్రస్ కూడా కనిపించదు. కానీ ఎక్కువ జనాభా ఉండేది పల్లెల్లోనే కదా. ఈ వైపుగా అధిష్టానం ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక పల్లెల్లో కొంచెం ఆదరణ పెరిగినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఏ మాత్రం సరిపోదు. ఆ పార్టీ సినియర్ నేతలే చెప్పినట్లుగా ఇంకా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన నేతనే దొరడం లేదు. ఇక గెలుపు అనేది బీజేపీకి సాధ్యం కాదని తేటతెల్లం అయ్యింది.

    రాష్ట్రం ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చారు కేసీఆర్. ఏపీలో కాకపోయినా తెలంగాణలో అయినా తాము అధికారంలో ఉండవచ్చనే దృష్టితో కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. కానీ కేసీఆర్ మాట తప్పారు. దీంతో ఏపీలో అడ్రస్ కోల్పోయిన కాంగ్రెస్, తెలంగాణలో కొంత మేర కనిపించినా పెద్దగా ప్రభావం మాత్రం చూపలేదు. 9 సంవత్సరాల తర్వాత కర్ణాటక గెలుపు తెలంగాణ కాంగ్రెస్ లో మరింత ఊపునిచ్చింది.

    బీఆర్ఎస్ బహిస్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు బీజేపీలోకి వెళ్తారనుకుంటుండగా అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరారు. మూడు రోజుల క్రితం వారు ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఊపు మరింత పెరిగింది. నేడు (జూలై 2) ఖమ్మంలో భారీ బహిరంగ నిర్వహించనున్నారు పొంగులేటి. ‘జనగర్జన’ సభగా ఏర్పాటు చేసిన సభకు దాదాపు 5 లక్షల మంది జన సమీకరణ చేయనున్నట్లు తెలిసింది.

    సభ గురించి హైలైట్స్
    * 100 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు.
    * హాజరుకానున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ.
    * 5 లక్షల మందిని సభకు తీసుకువచ్చేందుకు పార్టీ ఏర్పాట్లు.
    * బట్టి చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ఈ సభలోనే ముగింపు .
    * తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా తరలిరానున్న ప్రజలు.

    పొంగులేటి శ్రీనివాస్ చేరిక నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ బీఆర్ఎస్ లో వణుకు పుట్టించగా.. బీజేపీ మాత్రం ఉన్న కాస్త పాపులారిటీ కూడా కోల్పోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు ఖమ్మంలో మంచి పట్టు ఉంది. పొంగులేటితో పాటు జూపల్లి తోడైతే ఇక ఖమ్మం రాజకీయాలు పూర్తిగా వారి ‘హస్త’గతమవుతాయని స్పష్టమవుతుంది.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : నిర్మాతలను ఆదుకుంటున్న ఏకైక హీరో మహేష్ బాబు

    Mahesh Babu : దర్శకుడు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం...

    Pelli Kani Prasad : ‘పెళ్లి కాని ప్రసాద్’ పూర్తి సినిమా సమీక్ష

    Pelli Kani Prasad Review : 'పెళ్లి కాని ప్రసాద్' సినిమా కథ...

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : అసెంబ్లీలో కేసీఆర్.. అరుదైన సీన్

    KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు....

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    Telangana : తెలంగాణలో జోరుగా పరువు నష్టం దావాలు.. గెలిచేదెవరు ?

    Telangana Politics : మంత్రి కొండా సురేఖపైన హీరో నాగార్జున 100...

    Revanth : పాలన పై రేవంత్ పట్టు సడలుతోందా.. బీఆర్ఎస్ జోరు పెంచుతుందా?

    CM Revanth : పదేళ్లు తిరుగులేదని అనుకుంటూ పాలన సాగించిన బీఆర్ఎస్...