CM Revanth Reddy : ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ము హూర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి బహి రంగ సభ విశాఖపట్నంలో ఉంటుందని ఏపీ కాంగ్రె స్ పార్టీ ప్రకటించింది.
ఈనెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు బహి రంగ సభ ఉంటుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. బహిరంగ సభలో తెలంగాణ సీఎం ముఖ్యఅతిథి గా హాజరై ప్రసంగించ నున్నా రు.
కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు జాతీయ నేతలు కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రిలీజ్ చేసే అవకాశం కనబడుతోంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోటీ చేయబోయే అభ్య ర్థుల లిస్టు కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ నాయకుల సమక్షంలో ఏపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.