
Congress plan : వైఎస్సార్టీపీ అధినేత్రి వైస్ షర్మిల..కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు రాజకీయాల్లో చర్చ గా మారిన సంగతి తెలిసిందే. షర్మిల ..కాంగ్రెస్ లో చేరతారా లేదా అనేది ఇప్పటికైతే స్పష్త రాలేదు. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రతి రోజు చర్చ కు జరుగుతూనే ఉన్నది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలవటానికి సిద్ధమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లేదా పార్టీని విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే షర్మిల ఢిల్లీలో రాహుల్ తో సమావేశం కానున్నట్ల సమాచారం.
ఇదే సమయంలో ఏపీలోనూ పార్టీ ఎదుగదల కోసం షర్మిల చరిష్మాను వినియోగించుకోవాలని కాంగ్రెస్ ముఖ్య నేతల ఆలోచన. దీనికి సంబంధించి షర్మిల ఏ నిర్ణయ తీసుకుంటారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైందని, ఏపీలో వైసీపీకి చెక్ పడినట్లేనని ఏపీ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ తో కలిసి రాజకీయంగా ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తున్నది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ పెట్టిన షర్మిల తను ఊహించిన స్థాయిలో విజయం సాధించలేపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కన్నా కాంగ్రెస్ తో కలిసి వెళ్లడమే మేలని భావిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాలు చెబతున్నాయి.
అయితే ఆమె ఇప్పటికే తెలంగాణ లో పోటీ చేస్తానని ప్రకటించారు. పాలేరు నుంచి బరిలో ఉంటానని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుసగా భేటీ అవుతున్నారు. అదే సమయంలోనే కాంగ్రెస్ అధినాయకత్వం – కూడా నేరుగా షర్మిలతో చర్చించినట్లు తెలుస్తున్నది. షర్మిల రాహుల్తో పాటు .. ప్రియాంకతోనూ భేటీ కానున్నారు. అ తర్వాతే షర్మిల వైఖరిపై స్పష్టత రానున్నది.
కాంగ్రెస్లో చేరడం ఖాయం : ఏపీ బీజేపీ నేత..
షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఏపీ మాజీ మంత్రి..బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరాక తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయ పర్యటనలు చేస్తారని చెప్పుకొచ్చారు. సోనియాగాంధీ, రాహుల్, విజయమ్మ,షర్మిల అందరూ కలిసి ఏపీలో తిరిగితే వైసీపీ గల్లంతు అవుతుందని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
షర్మిల లక్ష్యం ఏమిటి ?
తన రాజకీయ ప్రస్థానంపై షర్మిల ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారని తెలుస్తున్దని. తాను తెలంగాణకే పరిమితమివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొందరు ఉద్దేశ పూర్వకంగా తనను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. తన భవిష్యత్ తెలంగాణతోనేనని తేల్చి స్పష్టం చేశారు. దీంతో ఏపీలో షర్మిల కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారనే ప్రచారానికి పరోక్షంగా ముగింపు పలికారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటానని..తెలంగాణ కోసం పోరాడుతానని షర్మిల స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వంతో చర్చల సమయంలోనే తెలంగాణకే పరిమితం అయ్యేలా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.