KCR Dupe Video Viral : ప్రస్తుత కాలంలో అందరు సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రచారం కూడా ట్రెండ్ మారుతోంది. అంతా సోషల్ మీడియానే నమ్ముకోవడంతో పార్టీలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. గతంలో వాల్ రైటింగ్, పోస్టర్లతో హోరెత్తించేవారు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. అంతా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం ముమ్మరం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ను లక్ష్యం చేసుకుని చేసిన వీడియో ఆద్యంతం హాస్యభరితంగా ఉంది. ఇందులో కేసీఆర్ మాదిరి నాయకుడిని పెట్టారు. ఆయన మాట్లాడుతుంటే అన్ని వక్రభాష్యాలు చెబుతుంటారు. కాళేశ్వరం, ధరణి పోర్టల్ తో దోచుకుంటాం. మీ భూములు కబ్జా చేస్తాం. మా పాలనలో మీరందరు బానసలు అంటూ చలోక్తులు విసిరారు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుతో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. దీన్ని అవకాశంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై విమర్శలు పెంచుతోంది. సోషల్ మీడియాను అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వీడియో చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.
బీఆర్ఎస్ పై వస్తున్న వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోంది. ప్రజల్లో వస్తున్న మార్పును గమనిస్తోంది. అందుకు అనుగుణంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. మూడోసారి ఏ పార్టీకి కూడా అధికారం ఇవ్వలేదు. అందుకే ఈసారి బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రచార సరళిని మారుస్తోంది. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని లబ్ధి పొందాలని ఆశిస్తోంది.