
Delhi Congress : ఢిల్లీలో కాంగ్రెస్ వరుసగా మూడోసారి సున్నా స్థానాలకే పరిమితమైంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24.55 శాతం ఓట్లతో 8 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల తర్వాత ఆప్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 2015లో మద్దతు ఉపసంమరించుకోవడంతో మళ్లీ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 9.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2020 ఎన్నికల్లో అయితే మరీ దారుణంగా కాంగ్రెస్ ఓట్ల శాతం 4,2కు పడిపోయింది. ఈ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. ఈసారి 6 శాతానికిపైగా ఓట్లు వచ్చినా.. ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఢిల్లీలో వరుసగా మూడోసారి సున్నా స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీని నమ్మని ఢిల్లీ ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఫలితాల్లో నోటాతో పోటీపడుతున్న కాంగ్రెస్.. అన్ని స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైంది. ఢిల్లీ ఫలితాల్లో కనిపిస్తున్న తెలంగాణ, కర్ణాటక పాలనకు ప్రతిఫలం అని బీజేపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు.