Jagan : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పాలన గాడి తప్పుతోంది. గుండాయిజమే ప్రధానంగా కనిపిస్తోంది. జగన్ ఒంటెత్తు పోకడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. జగన్ తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు మేలు చేయడం సరికదా కీడే చేస్తున్నాయి. దీంతో సీఎంపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది.
అమ్మఒడి వంటి పథకం విద్యార్థులకు మేలు చేసేవిగా లేవు. తల్లిదండ్రులకు బాధలే కలిగిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఇచ్చే రూ. 2 వేలతో పిల్లలు హాయిగా చదువుకునే వారు. కానీ ఇప్పుడు అమ్మఒడి పథకంతో విద్యార్థుల జీవితాలే చెల్లాచెదురైపోతున్నాయి. రూ. లక్షల కోట్లు అప్పుగా తేవడంతో ఒక్కొక్కరి పేరు మీద వేల కోట్ల అప్పు పడుతోంది.
రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో దించుతున్నారు. రాష్ట్రంలో అంతపెద్ద మొత్తంలో అప్పులు పెరుగుతుంటే సామాన్యుడికి తిప్పలు తప్పడం లేదు. ధరల పెరుగుదల వేధిస్తోంది. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సీఎం పట్టించుకోవడం లేదు. మీట నొక్కుతూ ప్రజల పీకల మీద కత్తి పెడుతున్నారు.
ప్రతిపక్షాల గొంతు సైతం నొక్కుతున్నారు. రౌడీయిజమే ప్రధానంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది. జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. త్వరలో జగన్ పాలనకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఏపీలో చంద్రబాబుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి.