ponguleti : కర్ణాటకలో లభించిన విజయంతో కాంగ్రెస్ నేతలు ఊపు మీద ఉన్నారు. తెలంగాణలో కూడా గెలుపు సాధించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాలో పాల్గొనే సభకు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు. అది మారుతూనే ఉంటుంది. మీకు రెండు సార్లు అధికారం ఇచ్చారు. ఈ సారి ఇవ్వడం కుదరదు. అందుకే మీరు పక్కకు పోతే మేం అధికారం తీసుకుంటాం. కానీ ఇలా అడ్డుపుల్లలు వేస్తున్నా మా గెలుపును శాసించలేరు. ఇది త్వరలో మీకే తెలుస్తందని ఆయన అభివర్ణించారు.
ఆదివారం సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభను ఫెయిల్ చేయాలని అధికార పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ పాల్గొంటున్నందున సభను నిర్వహించనివ్వద్దని పలు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుపుల్ల వేశారు. ప్రైవేటు బస్సులను కూడా రానివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. దీంతో ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ సభ విజయవంతం చేసి తీరుతామని చెబుతున్నారు.
ప్రజాస్వామ్యంలో అందరికి పాలించే సత్తా ఉంటుంది. ఒక మీ పార్టీయే ప్రతి సారి విజయం సాధిస్తుందని అనుకోవడం మీ భ్రమే. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ అన్ని శక్తులు ఒడ్డుతుంది. అధికారం చేజిక్కించుకుని తీరుతామని ప్రతిజ్ణ చేశారు. ముఖ్యమంత్రి ఇలాంటి చౌకబారు పనులు చేయడమేమిటని ప్రశ్నించారు. తన స్థాయికి తగినది కాదని హితవు పలికారు.
ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నాళ్లు అధికారంలో ఉంటారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అధికారం రాదు. అది మీ పగటి కలలే తప్ప వాస్తవం కాదు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై భరోసా ఏర్పడింది. అందుకే కర్ణాటకలో పట్టం కట్టారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం దక్కించుకుని తీరుతామని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు.
ReplyForward
|